మగబిడ్డకు జన్మనిచ్చి... వదిలేసి పరారైన తల్లి!

  • హైదరాబాద్ పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఆదివారం నాడు జన్మనిచ్చిన మహ్మదీ బేగం
  • తప్పుడు చిరునామా ఇచ్చిందంటున్న పోలీసులు
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి, ఆపై నిమిషాల వ్యవధిలో బిడ్డను వదిలేసి పరారైంది. ఈ ఘటన హైదరాబాద్ పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జరిగింది. చార్మినార్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 7వ తేదీన ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన మహ్మదీ బేగం అనే యువతి, ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరి, అదే రోజున మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆపై బిడ్డను వదిలేసి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వస్తుందని రెండు రోజుల పాటు వేచి చూసిన అధికారులు చివరకు చేసేదేమీ లేక చార్మినార్‌ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫలక్‌ నుమా ప్రాంతంలో గాలించినా, ఆమె జాడ దొరకలేదు. ఆమె తప్పుడు చిరునామాను ఇచ్చివుండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, చిన్నారిని శిశు విహార్‌ కు తరలించనున్నట్లు వెల్లడించారు. మహ్మదీ బేగం ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Hyderabad
Delivary
Baby Boy

More Telugu News